Site icon vidhaatha

ఇరాన్,ఆఫ్ఘాన్,పాక్ దేశాల ర‌వాణ నిలిపివేస్తున్న అదానీ పోర్ట్స్

విధాత‌: దేశవ్యాప్తంగా పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలకు సంబంధించిన సరకు రవాణాను తమ టెర్మినళ్ల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 15 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్దఎత్తున డ్రగ్స్‌పట్టుబడిన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

Exit mobile version