Site icon vidhaatha

ఈ బిజేపీ ఎంపీ చేసిన ప‌ని తెలిస్తే కోపం ఆపుకోలేరు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన (భోపాల్‌) ఎంపీ, మాజీ మేయర్‌ అలోక్‌ శర్మ కోవిడ్‌తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ‘ముక్తి వాహనం’ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పైగా తన ఫొటోషూట్‌ కోసమే ఈ వాహనాలను చాలా సేపు ఆపారంటూ శ‌ర్మ‌పై ఆరోపణలు వ‌చ్చాయి. దీనిపై మధ్య ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకుడు నరేంద్ర సలుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచనమైన చర్యకు పాల్పడినందుకు సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెటిజన్లు సైతం అలోక్ శ‌ర్మ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

Exit mobile version