Site icon vidhaatha

గోవాలో మరో తిరుపతి రుయా ఘటన

గోవాలోనూ తిరుపతి రుయా తరహా ఘటన… 4 గంటల వ్యవధిలో 26 మంది కరోనా రోగుల మృతి
ఈ ఉదయం గోవా ఆసుపత్రిలో కరోనా మృత్యుఘంటికలు

ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కరోనా రోగుల మరణయాతన హైకోర్టు విచారణ కోరిన ఆరోగ్యమంత్రి ఆసుపత్రిని సందర్శించిన సీఎం ప్రమోద్ సావంత్ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కొంతసేపు ఆక్సిజన్ నిలిచిపోయిన నేపథ్యంలో 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే.

గోవాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పనాజీలోనూ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపంతో 26 మంది కరోనా రోగులు తనువు చాలించారు. అర్ధరాత్రి తర్వాత 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో వీరంతా కన్నుమూశారు. గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఈ మేరకు వెల్లడించారు. ఈ ఘటనపై గోవా హైకోర్టు విచారణకు ఆదేశించాలని కోరారు.

కాగా, ఈ ఘటన జరిగిన ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సందర్శించారు. మెడికల్ ఆక్సిజన్ లభ్యత, సరఫరా ఈ రెండు అంశాల మధ్యలో ఏర్పడిన అంతరాయం ఈ పరిస్థితి దారితీసి ఉంటుందని సీఎం సావంత్ అభిప్రాయపడ్డారు. అయితే తమ వద్ద ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు.

Exit mobile version