ఉచితంగానే ఆయుష్మాన్ కార్డు అందిస్తున్న కేంద్రం.తీసుకున్న వారికి రూ.5 లక్షల బెనిఫిట్!కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకమైన స్కీమ్ తీసుకువచ్చింది.దీని పేరు ఆయుష్మాన్ భారత్ యోజన.ఈ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఆర్థిక సాయం లభిస్తుంది.ఆయుష్మాన్ లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డు వస్తుంది.కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కార్డు ప్రింట్ తీసుకోవాలి.దీనికి రూ.30 చెల్లించాలి.అయితే ఇప్పుడు ఒక్క రూపాయి కట్టకుండానే ఉచితంగానే ఆయుష్మాన్ కార్డు పొందొచ్చు.కేంద్ర ప్రభుత్వం ఫ్రీగానే ఇప్పుడు ఈ కార్డును లబ్ధిదారులకు అందిస్తోంది.ఆయుష్మాన్ కార్డు కలిగిన వారు హాస్పిటల్స్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు.ట్రీట్‌మెంట్‌కు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు లభిస్తాయి.గవర్నమెంట్ హెల్త్ సెంటర్ లేదంటే ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.ఈ పథకంలో చేరాలంటే మీకు అర్హత ఉందో లేదో కూడా వెబ్‌సైట్ ద్వారా సులభంగానే తెలుసుకోవచ్చు.ఇకపోతే ఆయుష్మాన్ భారత్ కార్డు పీవీసీ కార్డు రూపంలో ఏటీఎం కార్డును పోలి ఉంటుంది.