Site icon vidhaatha

కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెకు బెయిల్ మంజురు

విధాత‌: కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెకు బెయిల్‌ మంజూరు అయింది. రాయ్‌గఢ్‌లోని మహద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మహారాష్ట్ర సీఎంకు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని నారాయణ్‌ రాణె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రమంత్రి నారాయణ్‌ రాణెపై కేసు నమోదైంది. రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Exit mobile version