విధాత:పెగాసెస్ పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు.. నా ఫోన్ ను బీజేపీ హ్యాక్ చేసింది.. హ్యాకింగ్ భయంతో నా ఫోన్ కెమెరాలకు ప్లాస్టర్లు వేశా.. నా ఫోన్ సంభాషణలనూ హ్యాక్ చేస్తున్నారు.సంచలన పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందనీ, సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ కూలదోసిందంటూ మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. “మిస్టర్ మోదీ…నేను మీపై వ్యక్తిగతంగా దాడి చేయటం లేదు. కానీ మీరు, హోం మంత్రి, ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు, చివరికి బీజేపీ మంత్రులనే నమ్మలేదు’’ అంటూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో బుధవారం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన దీదీ, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ప్రతిక్షాలకు పిలుపు నిచ్చారు.