Site icon vidhaatha

తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు

తిరుమల: తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.‘‘పాలక మండలి లేనప్పుడు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.తిరుమలలో భక్తులకు ప్రసాదంగా భోజనం అందించాలి.అన్నప్రసాదానికి భక్తుల నుంచి నగదు తీసుకోకూడదు.సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నాం.సర్వదర్శనం అమలుపై అధికారులతో చర్చిస్తాం. అధికారుల హామీ మేరకు వీలైనంత మందికి ఉచిత దర్శనం కల్పిస్తాం’’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version