విధాత: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల అతలాకుతలం అవుతోంంది. ఎటు చూసినా నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై ఇండ్లలోకి వచ్చేశాయి. రోడ్లపై నిలిపిన కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
అదేవిధంగా కొన్ని చోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా కొన్ని ఇండ్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇంట్లోని వారు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లడంతో ప్రాణ నష్టం జరుగలేదు. ఈ నేపథ్యంలో తిరుమల రావాలనుకునేవారు ఎవరైనా కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.