విధాత:జూన్ 21 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న క్రమంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు.