Site icon vidhaatha

శ్రీవారి ఆలయంలో ఘనంగా ముగిసిన‌ జ్యేష్టాభిషేకం

విధాత‌:తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం గురువారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉండటం విశేషం.

మలయప్పస్వామీ ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేయగా, ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ అనంత‌రం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. జ్యేష్టాభిషేకం కార‌ణంగా గురువారం పౌర్ణ‌మి సంద‌ర్భంగా నిర్వ‌హించాల్సిన గ‌రుడ‌సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

Readmore:టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వండి:విజయసాయి రెడ్డి

Exit mobile version