Site icon vidhaatha

81 రోజుల తర్వాత 60 వేల దిగువకు

విధాత‌,న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి. 81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మరణాల సంఖ్య కూడా 1500 వద్దే నమోదవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 2,98,81,965. గడిచిన 24 గంటల్లో 1576 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,86,713కి చేరింది. ఇక కొత్తగా 87,619 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 2,87,66,009కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,29,243కి తగ్గి ఆ రేటు 2.44 శాతానికి చేరింది. ఇక మొత్తంగా 27,66,93,572 టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేసింది.

Readmore:రాష్ట్రాలకు మరో 47 లక్షల వ్యాక్సిన్‌ డోసులు

Exit mobile version