విధాత:అహ్మదాబాద్ కు చెందిన బయొలాజికల్-ఇ సంస్థ సిఎస్ఆర్ విభాగం డాల్టా ఫౌండేషన్ రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం రు.4 లక్షల విలువైన వైద్య పరికరాలను అందచజేసిందని కోవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 2,000 హెడ్ క్యాప్స్, 2,000 ఎన్95 మాస్క్ లు, 1,000 పిపిఇ కిట్లు, 2,500 సర్టికల్ యాప్రాన్లు, 7,500 సర్జికల్ గ్లోవ్స్, 1,500 సర్జికల్ మాస్క్ లు వున్నాయని ఆయన వివరించారు. దీనితో పాటు ఐటిడిసి సంస్థ నుండి ఆహారం ప్యాకెట్లు కూడా అందనున్నాయని, వాటన్నింటినీ ఆస్పత్రులకు తరలించి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.