Site icon vidhaatha

తెలంగాణ నుండి బ‌య‌లుదేరిన‌ మొదటి కిసాన్‌ రైలు

కాచిగూడ స్టేషన్‌ నుండి అగర్తలాకు 12 పార్సిల్‌ వ్యాన్లలో 284 టన్నుల ఉల్లిపాయల రవాణా

విధాత‌: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ డివిజన్‌లో కాచిగూడ స్టేషన్‌ నుండి మొదటి కిసాన్‌ రైలు రవాణా అయ్యింది. 12 పార్సిల్‌ వ్యాన్ల (వీపీయూలు)లో 284 టన్నుల ఉల్లిపాయల లోడిరగ్‌తో త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. కేంద్ర ఫుడ్‌ ప్రాససింగ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ వారు ‘‘ఆపరేషన్‌ గ్రీన్స్‌’టీఓపీ టు టోటల్‌’’ పథకం కింద అందజేస్తున్న 50% రాయితీ సరుకు రవాణా వినియోగదారులకు కల్పించబడిరది. ఈ కిసాన్‌ రైలు ద్వారా మొత్తం రూ.18.3 లక్షల ఆదాయం సమకూరింది. ఇది తెలంగాణ రాజధాని నండి రవాణా అయిన మొదటి కిసాన్‌ రైలు.

వ్యవసాయ రంగం మరియు రైతుల బలోపేతానికి ఫుడ్‌ ప్రాససింగ్‌ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన కిసాన్‌ రైలు లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి జోన్‌ తీవ్ర కృషి చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలోని బీడీయూ బృందం మరియు డివిజినల్‌ అధికారులు, సిబ్బంది కిసాన్‌ రైలు ప్రయోజనాలపై సరుకు రవాణా వినియోగదారులకు అవగాహన కల్పించడంలో విజయవంతం అయ్యారు. సరుకు రవాణాకు అత్యంత కనిష్ట చార్జీలతో భారతీయ రైల్వేలోని ఏదేనీ స్టేషన్‌కు వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి రైతులకు, వ్యాపారస్తులకు మరియు ఇతర కార్గో నిర్వాహకులకు ఇది ఎంతో తోడ్పడుతుంది. దేశంలోని సుదూర ప్రాంతాలకు కూడా ఉత్పత్తులను రవాణా చేసి మంచి మార్కెటు మద్దతు ధర పొందడానికి కూడా అవకాశముంటుంది. అంతేకాక, సరుకు రవాణా చార్జీలలో రాయితీ పొందడంతోపాటు మార్గ మధ్యలో సరుకులు చెడిపోకుండా ఉండడమే కాకుండా సురక్షితంగా మరియు సజావుగా సరుకు రవాణా అవుతుంది. ఈ ప్రయోజనాల వలన హైదరాబాద్‌ డివిజన్‌లోని కాచిగూడ స్టేషన్‌ నుండి ఉల్లిపాయలకు డిమాండ్‌ గల దేశంలోని ఈశాన్య ప్రాంతానికి మొదటి కిసాన్‌ రైలు రవాణా అయ్యింది.
హైదరాబాద్‌ నగరంలోని కీలకమైన కాచిగూడ స్టేషన్‌ నుండి మొదటి కిసాన్‌ రైలు రవాణాకు కృషి చేసిన హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య అభినందించారు. సరుకు రవాణా వినియోగదారులకు అనుకూలంగాగల జోన్‌లోని ఏదేని స్టేషన్‌ నుండి కిసాన్‌ రైళ్లను నడిపి రైతులకు మరియు వ్యాపారస్తులకు సహాయసహకారాలు అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.

Exit mobile version