విధాత: పేదలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల క్రితం నుంచి రోజుకు 2 వేల సర్వ దర్శనం టోకెన్లు జారీ ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు.కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చామన్నారు. టోకెన్లు పొందడానికి కౌంటర్ల వద్దకు వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారుత్వరలోనే సర్వ దర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచేందుకు అధికారులతో చర్చించామన్నారు.