Site icon vidhaatha

శ్రీవారి ఆలయంలో గరుడసేవ

విధాత‌: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కుంభవృష్టి కారణంగా వాహన మండపంలో పౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రావ‌ణ పౌర్ణ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడుని అధిరోహించి వాహన మండపంలోనే భక్తులకు దర్శనమిచ్చారు.
గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Exit mobile version