Site icon vidhaatha

India Corona: తగ్గిన కరోనా కేసులు

విధాత,దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. ముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేసులు 5.7 శాతం మేర తగ్గగా.. మృతుల సంఖ్య 400 దిగువకు చేరిందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా 17,21,205 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 34,457 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో 375 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు మార్చి 30 నాటి స్థాయికి క్షీణించాయి. దాంతో మొత్తం కేసులు 3.23 కోట్ల మార్కును దాటగా.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4.33లక్షలకు చేరింది. నిన్న 36 వేల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.

ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.15 కోట్లు(97.54 శాతం)గా ఉంది. క్రియాశీల కేసులు 3,61,340గా ఉండగా.. ఆ రేటు 1.12 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 36.36లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57,61,17,350గా ఉంది.

Exit mobile version