Site icon vidhaatha

స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న భార‌త్‌, పాక్ ఆర్మీ అధికారులు

శ్రీన‌గ‌ర్‌: రంజాన్‌ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా భార‌త్‌, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దులోని పూంచ్-రావ్‌కోట్ నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద‌, మెన్ధర్-హాట్‌స్ప్రింగ్ చెక్‌పోస్టుల వద్ద పాకిస్థాన్ ఆర్మీ, భారత సైన్యం అధికారులు ప‌రస్ప‌రం స్వీట్లు మార్పిడి చేసుకున్నారు.

భార‌త ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. రంజాన్‌, దీపావ‌ళి వంటి పండుగ‌ల సంద‌ర్భాల్లో దాయాది దేశాల సైనిక అధికారులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. అయితే ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌లెత్తిన సంద‌ర్భాల్లో ఆర్మీ అధికారులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు.

Exit mobile version