Site icon vidhaatha

పోస్టల్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

విధాత:భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ బేసిస్ పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ తెలియజేశారు. 10 వ తరగతి పాస్ అయ్యి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత హైదరాబాద్ నగరానికి చెందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

ఆసక్తి కలిగినవారు పూర్తి చేసిన దరఖాస్తులను తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, దివాన్ దేవడి, హైదరాబాద్ – 02 ఆఫీసులో జులై 30వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులు ఆగస్టు 12, 13 తేదీలలో ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి. ఏజెంటుగా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్ గా 5000/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ఆఫీసును సంప్రదించగలరు.

Exit mobile version