Site icon vidhaatha

సోనూసూద్‌పై ఐటీ సర్వే

విధాత‌: సినీ నటుడు సోనూసూద్‌పై ఐటీ శాఖ ‘సర్వే’ చేసింది. ఆయనకు సంబంధించిన ఆరు నివాసాల్లో తనిఖీలు చేసినట్టు సీఎన్‌బీసీ టీవీ 18 తెలిపింది. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది.

కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్ డౌన్ అమలు చేసినపుడు సోనూసూద్ వలస కూలీలను వేలాది మందిని స్వస్థలాలకు చేర్చి రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version