Site icon vidhaatha

తితిదేలో ఏకసభ్య కమిటీ

అమరావతి: తితిదేలో వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అర్చకుల శాశ్వత నియామకాలపై అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అర్చకుల శాశ్వత నియామకం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తితిదే అర్చకుల, భక్తుల విజ్ఞప్తులతో ఏకసభ్య కమిటీని నియమించినట్లు వెల్లడించింది. కమిటీ ఛైర్మన్‌గా జ్యూడీషియల్‌ ప్రివ్యూ ఛైర్మన్‌ జస్టిస్‌ శివశంకర్‌ రావు నియమించింది. వారసత్వ అర్చకుల వ్వవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై కమిటీ అధ్యయనం చేపట్టనుంది.

Exit mobile version