Site icon vidhaatha

సోనియాతో కమల్‌నాథ్‌ భేటీ ఆంతర్యం!

విధాత:కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ గురువారం పార్టీ అధినాయకురాలు సోనియాతో భేటీ అయ్యారు.జాతీయ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషిస్తారన్న ఊహాగానాలకు ఈ భేటీ తావిచ్చింది. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కమల్‌నాథ్‌ పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Exit mobile version