Site icon vidhaatha

డ్యాం లీకవుతుంటే.. అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలి

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నోటిధూల‌

విధాత‌: అల‌నాటి హీరోయిన్, పార్ల‌మెంటు స‌భ్యురాలు సుమ‌ల‌త‌పై క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి నోటిధూల ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. కావేరి నదికి అనుబంధంగా మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్‌(కేఆర్‌ఎస్‌) జలాశయం నుంచి నీరు లీకవుతుంటే, అడ్డుగా సుమలతను పడుకోబెట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేఆర్‌ఎస్‌ జలాశయానికి పగుళ్లు ఏర్పడ్డాయని సుమలత పలుమార్లు ఆరోపించారు. దీంతో జలవనరుల విభాగం ముఖ్య ఇంజనీర్ల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించింది. పగుళ్లు లేవని ఆ కమిటీ తేల్చింది. దీనిపై సోమవారం బెంగళూరులో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోందని సుమలత తరచుగా మాట్లాడుతున్నారని, జలాశయం రక్షణను ఆమె పర్యవేక్షిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే సుమలతను అడ్డుగా పడుకోబెట్టాలన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలపై సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం, సంస్కృతి లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. లీకేజీ జరిగే చోట ఆయననే పడుకోబెడితే సరిపోతుందన్నారు. ‘ముఖ్యమంత్రిగా కొనసాగారు. కనీస జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పారో దేశమంతా తెలుసు’ అని సుమలత ఎదురుదాడికి దిగారు.

Exit mobile version