Site icon vidhaatha

భవానీపుర్‌ ఉపఎన్నికలో దీదీ జ‌య‌భేరీ

విధాత‌: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు,తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగింది. రౌండ్‌ రౌండుకు దీదీ మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది.

58,832 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపుర్‌ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమెపై భాజపా తరఫున ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ పోటీలో ఉన్నారు. సీఎంగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత విజయం సాధించారు.

Exit mobile version