భారీగా తగ్గిన కేసులు,మరణాలు

4లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు విధాత,ఢిల్లీ:దేశంలో కరోనా కేసులు,మరణాలు భారీగా దిగొచ్చాయి.కొత్త కేసులు 30వేలకు తగ్గి.. దాదాపు నాలుగునెలల కనిష్ఠానికి క్షీణించాయి. మృతుల సంఖ్య మార్చి చివరినాటి స్థాయికి తగ్గింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 30,093 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 374 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.11 కోట్లకు చేరగా..4.14లక్షల మంది వైరస్‌కు బలయ్యారు. నిన్న 17,92,336 మంది నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇక క్రియాశీల […]

  • Publish Date - July 20, 2021 / 07:58 AM IST

4లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

విధాత,ఢిల్లీ:దేశంలో కరోనా కేసులు,మరణాలు భారీగా దిగొచ్చాయి.కొత్త కేసులు 30వేలకు తగ్గి.. దాదాపు నాలుగునెలల కనిష్ఠానికి క్షీణించాయి. మృతుల సంఖ్య మార్చి చివరినాటి స్థాయికి తగ్గింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 30,093 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 374 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.11 కోట్లకు చేరగా..4.14లక్షల మంది వైరస్‌కు బలయ్యారు. నిన్న 17,92,336 మంది నమూనాలు సేకరించి పరీక్షించారు.

ఇక క్రియాశీల కేసులు 4లక్షలకు తగ్గడం ఊరటనిచ్చే విషయం. మరోవైపు నిన్న 45వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.03 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు 1.35 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది.

41 కోట్ల టీకా డోసుల పంపిణీ..జనవరిలో కేంద్రం కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికింద ఇప్పటివరకు 41 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 52,67,309 మంది టీకా వేయించుకున్నారు.

Latest News