కరోనాకు కొత్త ఔషధం.. ఆమోదించిన కేంద్రం

విధాత‌: క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అత్యవసర చికిత్సకు కాక్ టైల్ డ్రగ్‌ను వినియోగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అనుమతులను కూడా క్లియర్ చేసింది. రోచే రెజెనెరన్ కాక్ టైల్ మెడిసిన్‌కు కేంద్రం అనుమతించింది. సెకండ్ వేవ్ ఇన్ ఫెక్షన్‌పై పోరాడేందుకు ఈ కాక్ టైల్ డ్రగ్‌ను యూఎస్ అధికారులు రూపొందించారు. సైంటిఫిక్ డేటా ఆధారంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కూడా కరోనా చికిత్సలో […]

  • Publish Date - May 6, 2021 / 09:52 AM IST

విధాత‌: క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అత్యవసర చికిత్సకు కాక్ టైల్ డ్రగ్‌ను వినియోగించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అనుమతులను కూడా క్లియర్ చేసింది. రోచే రెజెనెరన్ కాక్ టైల్ మెడిసిన్‌కు కేంద్రం అనుమతించింది. సెకండ్ వేవ్ ఇన్ ఫెక్షన్‌పై పోరాడేందుకు ఈ కాక్ టైల్ డ్రగ్‌ను యూఎస్ అధికారులు రూపొందించారు.

సైంటిఫిక్ డేటా ఆధారంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కూడా కరోనా చికిత్సలో ఇదే డ్రగ్‌ను వైద్యులు వాడారు.

ఇక భారత్‌లో రోచే ఇండియా ఈ మందును పంపిణీ చేస్తోంది. కసిరివిమాబ్, ఇండీవిమాబ్ యాంటీబాడీస్‌ను మిక్స్ చేసి ఈ మందును తయారు చేశారు. ఇన్ ఫెక్షన్ తగ్గించడానికి ఈ మందు బాగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఔషధ మిశ్రమాన్ని స్వల్ప లక్షణాలున్న పెద్దలకు, 12 ఏళ్ల నిండిన పిల్లలకు వినియోగించొచ్చని సూచించారు.

ఈ మందులో రోగులు ఆస్పత్రుల పాలు కాకుండా నివారించ వచ్చిని పేర్కొన్నారు. ఇన్ ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లలో కూడా ఈ ఔషధం వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.

Latest News