Site icon vidhaatha

కొవిషీల్డ్‌ వేసుకుంటే ఎలాంటి ప్రయాణ ఆంక్షలు వుండ‌వు

విధాత‌,ఢిల్లీ: కొవిషీల్డ్‌ టీకా వేసుకున్న భారతీయులు.. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేకుండా తొమ్మిది ఐరోపా దేశాలకు ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, ఎస్తొనియా దేశాలు అంగీకరించాయి.
కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను గ్రీన్‌పాస్‌ పథకం పరిధిలోకి తేవాలంటూ EU సభ్య దేశాలకు భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఐరోపా మెడిసన్స్‌ ఏజెన్సీ ధ్రువీకరించిన టీకాలు వేసుకున్న వారు మాత్రమే ఈ పథకం ద్వారా EUదేశాల్లో ఆంక్షలు లేకుండా ప్రయాణాలు చేయొచ్చు. ఇందులో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ను చేర్చలేదు.

Exit mobile version