విధాత: దేవభూమి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోడి సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అధికారులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో మోడి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.