విధాత:ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘ 2009 జనవరి 20 లోపు వచ్చిన ఏ డీపీఆర్ పెండింగ్‌లో లేదు. 2009 జనవరి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సవరించిన డీపీఆర్ రాలేదు. 2005-06 ధరల ప్రకారం ₹10,151.04 కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించారు. ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాలను అడ్వైజరీ కమిటీ కూడా 2011, 2019లో ఆమోదించింది’’ అని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పైవిధంగా సమాధానమిచ్చారు.