Site icon vidhaatha

రోజుకో మలుపు తిరుగుతున్న పంజాబ్ రాజ‌కీయం

విధాత‌: పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్‌ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదురుతోంది. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో విభేదాలు నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో అమరీందర్‌ సింగ్‌ ఉన్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో విసిగిపోయానని.. అవమానాల మధ్య పదవిలో కొనసాగలేనని సీఎం అమరీందర్‌ సింగ్‌ సోనియాకు స్పష్టం చేశారు. ఏ క్షణమైనా గవర్నర్‌కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం పంజాబ్‌కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరీందర్‌ వారసుడిని ఎన్నుకోనున్నారు.

Exit mobile version