Site icon vidhaatha

టీటీడీలో స్వామివారి సొమ్ములు కాజేసే కుట్ర జరుగుతుంది..పుట్టాసుధాకర్ యాదవ్

టీటీడీ పాలకమండలి రద్దుచేసి,స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడం వెనుక స్వామివారి సొమ్ములు కాజేసే కుట్ర దాగుంది.
టీటీడీ పాలకమండలిని కాదని, ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ నియమించడం వెనుకపెద్దకుట్రేఉంది..
స్వామివారికి భక్తులుసమర్పించే కానుకలు, ఆస్తులు, ఫిక్స్ డ్ డిపాజిట్ల స్వాహాకు కుట్రచేస్తున్నారు.
పాలకులదోపిడీకి పాలకమండలి సహకరించడంలేదనే స్పెసిఫైడ్ అథారిటీని నియమించారు.
స్వామివారి ప్రసాదవిక్రయకేంద్రాల్లో ప్రైవేట్ వ్యక్తులను నియమిస్తే, వారుచేతివాటంచూపే అవకాశముంది.
బ్యాంకులసిబ్బంది గతంలో ప్రసాదవిక్రయకేంద్రాల్లో ఉచితంగా సేవలందించేవారు.
హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పాలకులు వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పెసిఫైడ్ అథారిటీని రద్దుచేసి, పాలకమండలిని పునర్నియమించాలి.

విధాత :తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ వేయడంలోని మర్మమేంటని, పాలకమండలిని కాదని, అథారిటీ నియమించడంవెనుక పెద్దకుట్రేదో ఉందనే అనుమానం తమకు కలుగుతోందని టీడీపీనేత, టీటీడీ మాజీఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ విక్రయ కౌంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, హిందూభక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు.

పవిత్రంగా, నిష్టతో తయారుచేసే తిరుమల లడ్డూప్రసాదాన్ని అనేకబ్యాంకుల సిబ్బంది నిత్యం స్వామివారి సేవలో తరిస్తూ, విక్రయకేంద్రాల్లో ఉండి, భక్తులకుఉచితంగా అందించేవారున్నారు.అలాంటి ప్రసాదవితరణ కార్యక్రమాన్ని బయటివ్యక్తులకు అప్పగిస్తే, స్వామివారి ప్రసాదాన్ని ఇష్టానుసారంవారికి నచ్చినధరలకు అమ్ముకునే అవకాశముందని సుధాకర్ యాదవ్ అభిప్రాయపడ్డారు.శ్రీవారి ప్రసాదానికి ఎంతోవిశిష్టత, పవిత్రత ఉన్నాయని వాటిని మంటగలిపేలా స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయంతీసుకోవడం సరికాదన్నారు.

ప్రసాద విక్రయాల పేరుతో పెద్దస్కామ్ కు పాల్పడే అవకాశం కూడా ఉందన్నారు.దానితోపాటు స్వామివారిఆస్తులు,స్వామివారి పేరుతో బ్యాంకుల్లోఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల తాలూకా సొమ్ము నుకాజేయడానికే స్పెసిఫైడ్ అథారిటినీ నియమించడం జరిగిందన్నారు.గతంలో పాలకమండలిలోని అధికారులు దోపిడీకి అనుకూలంగా వ్యవహరించడంలేదని, ప్రభుత్వానికి సరిగా సహకరించడంలేదనే వారిని తప్పించి,అథారిటీని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఆస్తులు, ఇతరత్రా విలువైన వస్తువుల స్వాహాకు కుట్రజరుగుతోందన్నారు.అదేగానీ జరిగితే తిరుమలక్షేత్ర మహత్యంతోపాటు, స్వామివారి ఖ్యాతి, విశిష్టత మంటగలిసే అవకాశముందని సుధాకర్ చెప్పారు.హిందువులు, శ్రీవారిభక్తుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వంవెంటనే స్పెసిఫైడ్ అథారిటీనిరద్దుచేసి, పాలకమండలిని పునర్నియమించాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

Exit mobile version