Site icon vidhaatha

నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల

విధాత,తిరుమల : తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌చేసుకోవాలని తితిదే సూచించింది.

Exit mobile version