ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. హేతుబద్ధతలేని ప్రైవేటీకరణకే కాంగ్రెస్ వ్యతిరేకమని పేర్కొన్నారు.రైల్వే వంటి వ్యూహాత్మక రంగాలను కాంగ్రెస్ ప్రైవేటీకరించలేదన్నారు. నష్టాలు తెచ్చే పరిశ్రమలను కాంగ్రెస్ ప్రైవేటీకరించింది తప్పితే గుత్తాధిపత్యానికి దారితీసేలా చర్యలు చేపట్టలేదన్నారు.మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ప్రతి ఒక్కటి అమ్మేయాలని చూస్తోందని.. ఆర్థిక వ్యవస్థ నిర్వహించే తీరు భాజపాకు తెలియదని రాహుల్ విమర్శించారు.