Site icon vidhaatha

ట్రాక్ట‌ర్ న‌డుపుతూ పార్ల‌మెంట్‌కు రాహుల్ గాంధీ..

విధాత:మోదీ స‌ర్కార్ తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.అయితే ఆ కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ఇవాళ పార్ల‌మెంట్‌కు ట్రాక్ట‌ర్‌పై వ‌చ్చారు.రైతుల సందేశాల‌ను పార్ల‌మెంట్‌కు మోసుకు వ‌చ్చి న‌ట్లు రాహుల్ తెలిపారు. రైతు గొంతును ప్ర‌భుత్వం నొక్కి పెడుతోంద‌ని ఆరోపించారు. పార్ల‌మెంట్‌లో రైతు చ‌ట్టాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటోంద‌న్నారు. ఆ న‌ల్ల చ‌ట్టాల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. కొత్త సాగు చ‌ట్టాలు కేవ‌లం ఇద్దరు, ముగ్గురు వ్యాపార‌వేత్త‌ల‌కు మాత్ర‌మే ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.

Exit mobile version