Site icon vidhaatha

పార్ల‌మెంట్ కి సైకిల్ పై వ‌చ్చిన‌ రాహుల్‌

విధాత‌: రోజురోజుకూ చుక్కలనంటుతున్న పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యవసరాల ధరలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వినూత్న శైలిలో నిరసన తెలిపారు. మంగళవారంనాడు సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లారు. ఆయన వెంట విపక్ష పార్టీల నేతలు కూడా సైకిళ్లపై అనుసరించారు. దీనికి ముందు, రాహుల్ పార్లమెంటు విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బ్రేక్ ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యశక్తిగా నిలవాలని, ప్రజావాణిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అణగ‌దొక్కకుండా సంఘటితం కావాలని విపక్ష నేతలను కోరారు. కాంగ్రెస్‌తో పాటు, ఎన్‌సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, రివల్యూషనరీ పార్టీ (ఆర్ఎస్‌పీ), కేరళ కాంగ్రెస్, జార్ఖాండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) నేతలు ఈ బ్రేక్‌ఫాస్ట్ మీట్‌లో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు.

Exit mobile version