విధాత: సుప్రీంకోర్టు వెలుపల ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయిన 24 ఏళ్ల అత్యాచార బాధితురాలి ఉదంతంలో విచారణను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాకుండా దిల్లీ పోలీసులు గానీ, మరేదైనా సంస్థగానీ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని సామాజిక ఉద్యమకారిణి యోగిత గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణను కోరారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా అభ్యర్థన పంపించారు.