విధాత:దేశ రాజధాని ఢిల్లీ లో ఈ నెల 3 నుంచి 5 వ తేదీ వరకు జరుగు కార్యక్రమంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ప్రతినిధుల బృంద సభ్యులు RPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల గణేష్, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు Y V రావ్ ,తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ యాదవ్,ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు కెప్టెన్ మనోజ్ యాదవ్ లు ఈ ఉద్యమం లో పాల్గొనడము జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయము పైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రయివేటు అప్పగించే కుట్రకు వ్యతిరేకంగా,పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని,దేశ వ్యాప్తంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక చట్టాల ను రద్దు చేయాలని గత కొన్ని నెలలు గా రైతు లు చేస్తున్న పోరాటానికి మద్దతు గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల ప్రతినిధులు,విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు,ప్రజాసంఘాలు ఈ ఉద్యమంకు చలో ఢిల్లీ పిలుపునిచ్చారు.
వీటి తో పాటు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భారత దేశ తొలి సామాజిక ఉద్యమ పితామహులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి ఫూలే దంపతులకు,భారత రత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం కు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి దేశంలో వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యుల చేత సంతకాల సేకరణ RPS జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది.ఈ సంతకాలు సేకరణకు ఆంద్రప్రదేశ్ MPలు తలారి రంగయ్య ,గోరంట్ల మాధవ్ ,రెడ్డప్ప సహకారంతో 25 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు “భారత రత్న” ప్రకటించాలనే వినతిపత్రము లో చేయించారు, వీరికి RPS కృతజ్ఞతలు తెలుపుతూ,వారి నాయకత్వం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి వినతిపత్రాన్ని అందచేయడం జరుతుంది..