Site icon vidhaatha

తమిళనాడు నూతన డీజీపీగా శైలేంద్రబాబు

విధాత‌,చెన్నై : తమిళనాడు డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా శైలేంద్రబాబు నియమితులయ్యారు. గత కొన్ని రోజులుగా పలు పేర్లు పరిశీలనలో ఉండగా ఎట్టకేలకూ శైలేంద్రబాబు పేరు మంగళవారం ఖరారైంది. 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఇప్పటివరకు రైల్వే డీజీపీగా విధులు నిర్వరిస్తున్నారు. జైళ్లశాఖ డీజీ పీగా ఉన్నకాలంలో ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడంతోపాటూ పునరావాసం పథకాలను ప్రవేశపెట్టి మానవత్వం ఉన్న అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఇక ప్రస్తుత డీజీపీ త్రిపాఠి పదవీకాలం బుధవారంతో ముగియనుంది.

Exit mobile version