విధాత:గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియక అంతా టెన్షన్ పడుతుంటారు. ఉన్నట్టుండి సిలిండర్ ఖాళీ అయిపోతుంది. రెండో సిలిండర్ ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే మాత్రం తిప్పలే. అంతేకాదు గ్యాస్ సిలిండర్ బరువు భారీగా ఉంటుంది. మోయలేక అవస్థలు పడుతుంటారు. అయితే ఇకముందు అలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో ముందే తెలిసిపోతుంది. అంతేకాదు గ్యాస్ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.