విధాత:వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణరాజు అనర్హత పటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఆ విషయంపై రన్నింగ్ కామెంటరీ చేయలేమని స్పీకర్ అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ అంటూ ఉంటుందని, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు. సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు.
ఇదిలా ఉంటే, రఘురామ అనర్హత పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కోరిన విషయం తెలిసిందే. గత శుక్రవారం స్పీకర్‌ను కలిసిన ఆయన.. పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు.అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు.ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.