తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు ఏకాంతంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం ముగిశాయి.
చివరిరోజు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.