విధాత:తిరుమల తిరుపతి దేవస్థానాల వెబ్సైట్ లోని తోమాల సేవను కొందరు వ్యక్తులు తోమస్ సేవగా మార్చి దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఇలాంటి కుట్రలను టీటీడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. తోమాల సేవను తోమాస్ సేవగా మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.