విధాత:పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ రోజు స్టూడెంట్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది.
క్రెడిట్ కార్డు సహాయంతో,ఒక విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడానికి 10 లక్షల వరకు రుణం పొందవచ్చు.ఈ పథకానికి అర్హత వయస్సు 40 సంవత్సరాల వరకు.ఉద్యోగం పొందిన తరువాత రుణం తిరిగి చెల్లించడానికి ఒక విద్యార్థికి 15 సంవత్సరాలు గడువు ఇవ్వబడుతుంది.