విధాత: లఖింపుర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునిశిత పరిస్థితి దృష్ట్యా ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం. చేతులు ముడుచుకు కూర్చుంటామంటే కుదరదు. హత్య కేసు నిందితుడిని ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తోంది. అన్ని కేసు నిందితులను ఒకేవిధంగా చూడాలి. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ పరిష్కారం కాదు. నిందితుడు సామాన్యుడైతే ఇలాగే చేస్తారా? దీనిపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపడతాం’’ అని సుప్రీం వెల్లడించింది.