Site icon vidhaatha

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి ఫోన్‌

విధాత‌:ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థి తులను ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో పరిస్థితులను, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నకడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రధానికి నివేదించారు.

వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియో గించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహా యం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సీఎంకు చెప్పారు.

Exit mobile version