Site icon vidhaatha

కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్న టీటీడీ

విధాత:రెండు తెలుగు రాష్ట్రాల్లోని 177 కల్యాణ మండపాల నిర్వహణను లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.హిందూ సంస్థలకు, ఆలయాలకు, మఠాలకు, ట్రస్టులకు, హిందు మతానికి చెందిన వ్యక్తులకు ఐదేళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్టు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర వివరాలకు ‘తిరుమల.ఆర్గ్‌’, ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌.జీవోవీ.ఇన్‌’లో చూడాలని పేర్కొంది. కాగా, చిత్తూరు జిల్లాలోని 14 కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్టు బుధవారమే ప్రకటించింది. ఆసక్తిగలవారు సెప్టెంబరు ఒకటో తేదీల్లోగా ప్రతిపాదనలను ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించింది.

Exit mobile version