విధాత: పంజాబ్ కాంగ్రేస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు.పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేయడంతో మారుతున్న రాజకీయ సమీకరణాలు.సిద్దూకి మద్దతుగా మంత్రి రజియా రాజీనామా చేశారు.కేబినెట్ కూర్పు పై నవజోత్ సిద్దూ అసంతృప్తి.ఆప్ లో చేరుతానంటూ జోరుగా ప్రచారం,సిద్దూ ఒత్తిడితో మంత్రివర్గంలో మార్పులు చేస్తారంటూ ప్రచారం జరుగుతుండగా సిద్దూతో పలువురు ఎమ్మేల్యేలు భేటీ అయ్యారు.ఇదిఇలా ఉండగా కెప్టెన్ అమరెందర్ సింగ్ ఢీల్లీ కి వెళ్లారు,అయితే కెప్టెన్ బీజీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.ఈ పరిణామాల దృష్ట్యా పంజాబ్ కేబినేట్ కాసేపట్లో సమావేశం కానుంది.