Site icon vidhaatha

త్వరలోనే ఫిర్యాదుల అధికారిని నియమిస్తాం

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ట్విటర్‌

విధాత‌: కొత్త ఐటీ నిబంధనలు అమల్లో జాప్యం చేస్తున్న ట్విటర్‌.. త్వరలోనే తాము నిబంధనల అమలును పర్యవేక్షించే ముఖ్య అధికారితో పాటు, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని నియమిస్తామని దిల్లీ హైకోర్టుకు తెలిపింది. తాము ఇప్పటికే నియమించిన మధ్యంతర గ్రీవెన్స్‌ అధికారి గత నెల 21న పదవి నుంచి వైదొలిగారని న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కొత్త అధికారిని నియమించే లోపు.. భారతీయ వినియోగదారుల సమస్యలను జనరల్‌ గ్రీవెన్స్‌ అధికారి ద్వారా పరిష్కరిస్తామని.. ఐటీ రూల్స్‌ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌కు స్పందనగా ట్విటర్‌ తెలిపింది. దీనిపై విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ చట్టాల ప్రకారం భారత్‌కు చెందిన వ్యక్తిని రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిగా నియమించాల్సి ఉంటుంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సదరు హోదాలో ఉన్న అధికారి స్పందించాల్సి ఉంటుంది.

Exit mobile version