విధాత:పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో సూచనలు.క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలి.ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలి.
టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని సూచన.పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలి.కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి.
వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకం.ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి.పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచన.
ఇందుకోసం జిల్లా,సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.