ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచుతూ దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
★ దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36కు.. డీజిల్ రూ.95.44కు చేరుకుంది.
★ ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.108.37కి చేరడం గమనార్హం.
★ ఇప్పటికే మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైకి ఎగబాకిన విషయం తెలిసిందే.
★ ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్, కర్ణాటక ఉన్నాయి.
★ హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.101.04గా, డీజిల్ రూ.95.89గా నడుస్తోంది.
★ దేశ రాజధాని దిల్లీలో ఈ రేట్లు వరుసగా.. రూ.97.22, రూ.87.97గా ఉన్నాయి.
★ మే 4 తర్వాత పెట్రో ధరలు పెరగడం ఇది 27వ సారి.
★ ఈ 48 రోజుల్లో లీటర్ పెట్రోల్ రూ.6.82, లీటర్ డీజిల్ రూ.7.24 ప్రియమైంది.
★ అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 రోజుల పాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది.
★ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన అధిక పన్నులే భారీ పెట్రో ధరలకు ప్రధాన కారణాలు.
★ అయితే, గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ధరలు కాస్త తగ్గినప్పటికీ దేశీయంగా ధరలు మాత్రం పెరగడం గమనార్హం.
★ అయితే, ఇటీవలి ఎన్నికల సందర్భంగా ధరల పెంపును నిలిపివేసిన సమయంలో తలెత్తిన నష్టాల నుంచి కోలుకోవడానికే ఇంధన విక్రయ సంస్థలు ధరల్ని పెంచుతున్నాయని సమాచారం.