విధాత:ప్రముఖ పాత్రికేయులు కథ నవలా రచయిత పిళ్లా కృష్ణమూర్తి (వీరాజీ) మృతి ఎంతో విచారకరమని, ఇది పత్రికా రంగానికి తీరనిలోటని భారత ఉపరాష్ట్రపతి ముత్తవరపు వెంకయ్య నాయుడు ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అందరికీ వీరాజీగా సుపరిచితమైన ఆయన నన్నెంతగానో అభిమానించేవారన్నారు. అంతేకాకుండా తనను కలిసినప్పుడెల్లా ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలను ప్రస్తావించేవారన్నరు. జై ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి విద్యార్థి దశలో తనకు పరిచయమైన వీరాజీ పాతతరంలోని నవతరం పాత్రికేయులని గుర్తు చేశారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ఎంతో సౌమ్యులు,మంచి మనిషి, విలువలు పాటించిన పాత్రికేయుడని శ్లాఘించారు. పాత్రి కేయుడిగానే కాకుండా రచయితగా కవిగా ఆయన సాహితీ లోకానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. వారి కలం నుంచి జాలువారిన ఎన్నో పుస్తకాలు పలు భారతీయ, విదేశీ భాషల్లో అనువాదం అయ్యాయని ప్రకటనలో పేర్కొన్నారు. పిళ్లా కృష్ణ మూర్తి (వీరాజీ) ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.